వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొందరతో పార్టీని వీడొద్దు: కెసిఆర్, జగన్ భయమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తొందరపడి ఎవరైూ పార్టీని వీడవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్టీ నాయకులకు ఉద్బోధ చేశారు. వైయస్ జగన్ నాయత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగానే ఆయన ఆ ఉద్బోధ చేసినట్లు భావిస్తున్నారు. పదవులు రాలేదని పార్టీని వీడొద్దని, అందరికీ పదవులు వస్తాయని ఆయన అన్నారు.

తెలంగాణ జెఎసి తమతోనే ఉందని ఆయన చెప్పుకున్నారు. నెల రోజుల్లో ఊహించని మార్పులు వస్తాయని అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి 15 మంది శాసనసభ్యులు పార్టీలోకి వస్తామంటున్నారని, అందరినీ తీసుకుని ఇబ్బంది పడదలుచుకోలేదని ఆయన అన్నారు. కొత్తవారు వచ్చినా పాతవారిని విస్మరించబోనని హామీ ఇచ్చారు. కార్యవర్గంలో ఉన్నవారందరికీ పదవులు వస్తాయని చెప్పారు.

అదే సమయంలో పార్టీ నాయకులకు హెచ్చరిక లాంటిది కూడా చేశారు. పనిచేయని నియోజకవర్గం ఇంచార్జీలను మార్చేస్తానని అన్నారు. డిసెంబర్ 5వ తేదీనుంచి తలపెట్టిన పల్లెబాటను సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితిని, నియోజకవర్గం పరిధిని బట్టి 30 రోజుల నుంచి 40 రోజుల వరకు పల్లెబాట నిర్వహించాలని ఆయన సూచించారు. పల్లెబాటలో పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ ప్రజలంతా తెరాసతోనే ఉన్నారని, వారిని తమ మలుచుకోవడంలో పార్టీ నాయకులే విఫలమవుతున్నారని ఆయన అన్నారు. ఓట్ల వరదను అందుకున్నవాడే విజేత అని చెప్పారు. అందరినీ రాజకీయంగా ఓ స్థాయికి తెచ్చే బాధ్యత తనదేనని కెసిఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 73 అసెంబ్లీ స్థానాలు, 14 లోకసభ స్థానాలు వస్తాయని ఆయన చెప్పారు. అందుకు ఓ సంస్థ నిర్వహించిన సర్వేను ఉటంకించారు. పల్లెబాటలో తాను పాల్గొనే విషయంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తెరాస సూర్యాపేటలో మాదిరిగా నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.

తమ పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పార్టీ మారుతారనే వార్తల్లో నిజం లేదని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందరు చెప్పారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రొత్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని చెప్పారు. పనిచేయని నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు ఉంటుందని అన్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao has suggested partymen not to leave party. He said that party will win 73 assembly seats and 14 loksabha seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X