హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళితులకు అండగా: సబ్ ప్లాన్ బిల్లు ప్రవేశ పెట్టిన కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికే ఖర్చు పెట్టేందుకు ఉప ప్రణాళిక బిల్లు ఉపయోగపడుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఇది అమలులోకి వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయలేదని, ఎస్సీల సమగ్ర అభివృద్ధికి ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు.

ఈ బిల్లుకు చట్టబద్దత కల్పిస్తే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సమగ్ర అభివృద్ధి, భద్రత, సామాజిక హోదా కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశ్యం అన్నారు. వచ్చే పదేళ్ల పాటు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమానత్వం సాధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. ఈ బిల్లు అమలుపై సభ్యులు సూచనలు, సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సభను రేపటి(శనివారం)కి వాయిదా వేశారు.

కాగా అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ నేతృత్వంలో ట్యాంకుబండు మీద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి వారు అసెంబ్లీకి పాదయాత్రతో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. దళితులకు తెరాస అండగా ఉంటుందని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈటెల రాజేందర్ కోరారు అవసరం అయితే కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్దతకు తమ పార్టీ మొదటి నుండి పోరాటం చేస్తుందని అన్నారు.

English summary
CM Kiran Kumar Reddy has produced SC, ST sub plan bill on Friday in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X