వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పావు శ్వేతా భట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi-Swetha Bhatt
అహ్మదాబాద్: గుజరాత్‌లో దూసుకుపోతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత నరేంద్ర మోడీని సాధ్యమైనంత మేర ఎదుర్కొనేందుకు కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా మోడీ పైన ఏకంగా సస్పెన్షన్‌కు గురైన ఓ ఐపిఎస్ అధికారి సతీమణిని మోడీ పైన ఎన్నికల బరిలో నిలబెట్టేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోంది. గోద్రా అల్లర్లకు సంబంధించిన కేసులో సంజీవ్ భట్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఆయన సతీమణి శ్వేతా భట్‌ను కాంగ్రెసు మోడీ పైన పోటీ చేయించి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు(శుక్రవారం) కాంగ్రెసు పార్టీ శ్వేతా భట్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. శ్వేత త్వరలో నామినేషన్ వేయనుందని, ఎన్నికలలో పోటీ చేస్తుందని చెప్పారు.

శ్వేతాకు సిగ్నల్స్ అందటంతో ఆమె ఇప్పటికే తన ప్రచారాన్ని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రారంభించారు. సంజీవ్ భట్‌ను పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసినప్పుడే శ్వేతా భట్ బయటకు వచ్చింది. తన భర్తకు మద్దతుగా నిలిచింది. తన భర్తకు ప్రాణ భయముందని కేంద్రమంత్రి చిదంబరంకు లేఖ రాసింది.

ఎన్నికల సర్వే ఫలితాలు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ పాలనపై ప్రజలు అనుకూలంగా ఉన్నారని, బిజెపియే మెజార్టీ స్థానాలు గెలుస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. శ్వేతను బరిలోకి దింపడం ద్వారా మోడీతో పాటు బిజెపిని ఆత్మరక్షణలో పడవేయడమే కాకుండా సానుభూతి ఓట్లు పొందేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
The political scenario in Gujarat has been changing day by day as the assembly elections are round the corner. Now, Congress seems to have used its trump card to weaken Narendra Modi providing ticket to the Chief Minister's bete noire Sanjeev Bhatt's wife Shweta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X