ఎపిలో రాహుల్ దూతలు: జగన్‌తో రాజీపై ఆరా

రాహుల్ గాంధీ ప్రతినిధులు శనివారంనాడు కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వారు ఆరా తీశారు. జగన్ బలాబలాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్‌తో రాజీకి వస్తే లాభమా, నష్టమా అని అడిగారు. వైయస్ జగన్‌తో రాజీకి వస్తే మంచిదని కొంత మంది సూచించినట్లు తెలుస్తోంది.
జగన్‌తో రాజీ గురించి వారు ప్రత్యేకంగా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. సిబిఐ కేసులు ఎత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే వైయస్ జగన్ రాజీకి వస్తాడేమోనని జెసి దివాకర్ రెడ్డి వారితో అన్నారు. లోకసభ స్థానాల్లో కొత్త అభ్యర్థులను పోటీకి దింపాలని ఆయన సూచించారు.
రాయలసీమ, కోస్తాల్లో పార్లమెంటు స్థానాలపై రాహుల్ గాంధీ పరిశీలకులు చర్చలు జరిపారు. సిట్టింగ్ పార్లమెంటు సభ్యులపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల్లోని 23 లోకసభ స్థానాల్లో పార్టీ పరిస్థితిపై వారు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత వారు జిల్లాల్లో పర్యటనలు చేయడానికి బయలుదేరి వెళ్లారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి రాహుల్ గాంధీ వారిని పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications