జగన్ సోదరి షర్మిలకు షాక్!: 'కడప' అవినాష్ రెడ్డికి

దీనిపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం స్పందించారు. కడప లోకసభ స్థానం నుండి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. షర్మిల రాష్ట్రంలో ఎక్కడి నుండి పోటీ చేసినా అలవోకగా గెలుస్తారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము తెలంగాణలో ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని ఆమె చెప్పారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, తమ పార్టీకి మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ దూతలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెసుకు పుట్టగతులు ఉండవని ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. అవినీతి, ఆరోపణలపై జైల్లో పెట్టించినా తమ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెసు పార్టీలో చేరే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో తెరాస కన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే బలంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications