వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ కూలితే ఇక్కడ కూల్చేసత్తా ఉంది: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
ఏలూరు/హైదరాబాద్: కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే సత్తా తమ పార్టీకి ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఆదివారం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా కేవలం తమ పార్టీకే ఉందన్నారు.

రాయదుర్గం హైలెవల్ కెనాల్‌కు నీరు నిలిపివేయడం దారుణమని అనంతపురం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అనంతపురం జిల్లాలో అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా కిరణ్ ప్రభుత్వం ప్రేరేపిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. తక్షణమే హెచ్‌ఎల్‌సికి నీటిని ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నేను రాజీనామా చేసినప్పుడు రాలేదేం?

తెలంగాణ కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు పార్టీ నేతలు ఎవరూ కలిసి రాలేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హైదరాబాదులో విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకుందాం... అధిష్టానమే తెలంగాణ ఉస్తుందని వారు వెనక్కి తగ్గారన్నారు. తాను వదిలేసిన మంత్రి పదవి కోసం ఇప్పుడు కొంతమంది లాబీయింగ్ కూడా చేశారన్నారు. ఇప్పుడు ఆ నేతలే తెలంగాణ కోసం ఫ్రంట్ పెట్టాలని అంటున్నారని విమర్శించారు.

చిత్తశుద్ధి లేని ఇలాంటి ప్రయత్నాల వలన ఫలితాలు ఉండవని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు తనతోపాటే రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో వచ్చి ఉండేదన్నారు. తెలంగాణపై స్పష్టత రాకుంటే ప్రజల కోరిక మేరకు నడుచుకుంటానని ఆయన చెప్పారు.

English summary

 YSRC Congress leaders and former minister Konda Surekha said out party is ready to vote against Kiran Kumar Reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X