వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బి.కాం. అమ్మాయి దారుణ హత్య: రైలు కిందపడి ఇద్దరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 B.Com girl student killed in Vishaka
విశాఖపట్నం: జిల్లాలోని మధురవాడ నగర శివారులో ఓ విద్యార్థిని అనుమానాస్పద మృతిలో హత్యకు గురైంది. స్థానిక ఏజిఎల్ కలాశాలలో బికాం మొదటి సంవత్సరం చదువుతున్న జయలక్ష్మిగా దొరికిన ఐడెంటిటీ కార్డ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. మృతురాలి వద్ద ఐడెంటిటీ కార్డు, పుస్తకాలు పోలీసులకు దొరికాయి. సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో ఆమె కళాశాలను, నివసించే ప్రాంతాన్ని గుర్తించన పోలీసులు తల్లికి సమాచారం అందించారు.

ఆమె మృతికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. జయలక్ష్మి పైన ఎలాంటి అత్యాచార ప్రయత్నం జరగలేదని పోలీసులు భావిస్తున్నారు. ఆమె బట్టలు చిరగడం, శరీరంపై గాట్లు లేకపోవడం, పెనుగులాటకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అత్యాచార యత్నం కాదని చెబుతున్నారు. ఎవరో ఆమెను తీసుకు వచ్చి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. కేవలం గొంతు పైన కొద్దిగా గాట్లు కనిపించాయని చెబుతున్నారు.

దీంతో ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆధారాలు సేకరిస్తున్నామని, వైద్యులు ఇచ్చే ఆధారాలతో ఏం జరిగిందో చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. ఆధారాల కోసం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. జయలక్ష్మిది ఆర్కే బిచ్ వద్ద గల ఓట గడ్డ ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైలు కింద పడి ఆత్మహత్య

విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఓ బిస్కట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారని, వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.

అన్నా చెల్లెల్లు మృతి

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో ఇద్దరు అన్నా చెల్లెళ్లు ఆడుకుంటూ వెళ్లి స్థానిక శివాలయం వద్ద ఉన్న కోనేటిలో పడి మృతి చెందారు. ఆరేళ్ల సతీష్, నాలుగేళ్ల దుర్గలు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ వారి జారి కోనేటిలో పడ్డారు. దీంతో గ్రామం దుంఖసాగరంలో మునిగిపోయింది.

English summary
A B.Com first year student was killed by unknown persons on Sunday morning at Madhurawada of Vishakapatnam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X