సమాచారంఉంటే ఇవ్వండి: జగన్‌పై విజయమ్మకు బొత్స

అంతేకాని అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్దతకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. ప్రభుత్వం మంచి పని చేసిందన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు. బిల్లు సమయంలో సభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటం చాలా బాధాకరమని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రలు అధికారం కోసమే అన్నారు. విద్యార్థులకు మెస్ ఛార్జీల పెంపును తాము ఆహ్వానిస్తున్నామన్నారు. మద్యం ధరల పెంపు అంశం తన దృష్టికి వచ్చిందని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వద్దని తాను చెబుతానని అన్నారు. సబ్ ప్లాన్ బిల్లు పైన ప్రధాన ప్రతిపక్షాలు సంకుచితంగా వ్యవహరించాయన్నారు.
కాంగ్రెసులో సమన్వయ లోపం ఉన్నందుకు బాధపడుతున్నానని చెప్పారు. బిల్లు ఆమోదం సందర్భంగా సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటం బాధాకరమే అన్నారు. సబ్ ప్లాన్ బిల్లు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదేశాలతోనే ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. బిల్లు సందర్భంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైఖరులు బహిర్గతం అయ్యాయని చెప్పారు.
జగన్ ఆస్తుల కేసులో ప్రస్తుతం సిబిఐ విచారణ జరుగుతోందని, దాంతో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇప్పుడు జరుగుతున్న విచారణకు సహకరిస్తే చాలని విజయమ్మ వ్యాఖ్యలకు సమాధానంగా చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే విచారణ జరుగుతోందన్నారు. సంక్షేమానికి మారు పేరు కాంగ్రెసు అన్నారు.
జగన్ కేసులో మంత్రులు కౌంటర్
కాగా జగన్ ఆస్తుల కేసు విషయంపై 26 జివోలకు సంబంధించిన అంశంలో మంత్రులు, అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రెండు వారాల సమయం కోరారు. విచారణ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications