కెవిపిని వదిలేసి జగన్‌ను: దామోదర్, కోవర్టేమో: వివేక్

కెవిపి పిసిసి అధ్యక్షుడైతే తెలంగాణ వస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ అదేలా సాధ్యమని మీడియా ప్రతినిధులు అడిగితే కెవిపి పచ్చి సమైక్యవాది అని, కనీసం అప్పుడైనా తమ వాళ్లకు బుద్ధి వచ్చి కాంగ్రెస్ నుంచి బయటికి వస్తే అధిష్ఠానం దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందని ఆయన జవాబిచ్చారు. ఈసారి ఎన్నికల్లో తన తనయుడిని రంగంలోకి దించుతానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోవర్టుగా పని చేస్తున్నారేమో..? అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండు.. పోతేపో అనడానికి ఆయనెవరంటూ కిరణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవరికో కోవర్టుగా పని చేస్తున్నారని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మారంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి వల్లే కాంగ్రెస్‌పార్టీ బలహీనపడుతోందని ఆయన విమర్సించారు.
పార్టీలో కొనసాగుతున్నవారిని ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. తమకు పదవులు కావాలని ఏనాడూ అధిష్ఠానం వద్ద ఒత్తి చేయడం లేదు గానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే తెలంగాణ ఎంపీలంతా ప్రధానిని కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించామని, అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు.
డిసెంబర్ 9 వరకు గడువు ఇచ్చామని, ఆలోపు తేలకపోతే మళ్లీ ఎంపీలమంతా సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికనలు రూపొందించుకుని దశలవారీ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications