వైయస్ పాలనపై విజయమ్మ రెడీనా: పయ్యావుల

ప్రస్తుతం సిబిఐ విచారణకు రాని ఎన్నో అంశాలు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. మాట తప్పం.. మడమ తిప్పం.. అంటూ గొప్పలకు పోయే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చేతనైతే వైయస్ విజయమ్మ మాటలను నిజం చేసి చూపించాలని అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో తెలంగాణ రాదని ప్రజలు తెలుసుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన తోటి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి, తదితర శాసనసభ్యులతో కలిసి మీడియా ప్రతినిధులతో నిజామాబాద్ జిల్లా సాలెంపాడులో మాట్లాడారు. మాదిగలు, ఉప కులాలపై కాంగ్రెసు ప్రభుత్వం వైఖరి ఏమిటో శాసనసభ సమావేశాల్లో తేలిపోయిందని ఆయన అన్నారు.
ఎలాగైనా, వైయస్ జగన్‌కు బెయిల్‌ను మంజూరు చేయించుకోవడమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. జగన్‌కు బెయిల్ సంపాదించుకోవడానికి కాంగ్రెసుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయిందని ఆయన విమర్శించారు. జగన్‌కు బెయిల్ సంపాదించుకోపడానికే అవిశ్వాసం పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు అంటోందని, ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం ఆ పార్టీకి లేదని ఆ పార్టీ నాయకుల మాటలను బట్టి అర్థమవుతోందని ఆయన అన్నారు. నీలం తుఫాను బాధితులను పట్టించుకోవడం లేదని దూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బైబిల్ చేతులో పట్టుకుని వైయస్ విజయమ్మ అసత్య ప్రచారం సాగిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బాలినేని మాటలు కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయిన విషయాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేదని తెలుస్తోందని, పైగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని వైయస్ విజయమ్మ, షర్మిల అంటున్నారని ఆయన అన్నారు.
నిజామాబాద్ జిల్లా సాలంపాడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టిడిఎల్పీ సమావేశం జరిగింది. వేయి కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన చంద్రబాబును శానససభ్యులు అభినందించారు. వైయస్ జగన్ బయటకు వచ్చిన తర్వాతనే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటోందని, ఆ పార్టీకి ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని చంద్రబాబు శాసనసభ్యులకు సూచించారు.












Click it and Unblock the Notifications