అక్రమాలు చెప్తా: 'గాలి'పై పోటీకి సై అన్న తపాలా గణేష్

Gali Janardhan Reddy - Tapala -Ganesh
బెంగళూరు: వచ్చే శాసనసభ ఎన్నికలలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పోటీ చేస్తే ఆయనపై తాను బరిలోకి దిగుతానని తమటి మైనింగ్ కంపెనీ యజమాని తపాలా గణేష్ వెల్లడించారు. తమటి మైనింగ్ కంపెనీ యజమాని అయిన తపాలా గణేష్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యజమాని అయిన గాలి జనార్ధన్ రెడ్డితో మైనింగ్ విషయమై తీవ్ర విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. గాలి అక్రమ మైనింగ్ పైన పోరాటం చేశారు.

తాజాగా తపాలా గణేష్ రాజకీయాల్లో గాలిని దెబ్బ తీసేందుకు రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అక్రమ మైనింగ్‌తో రాష్ట్ర సంపదను దోచుకున్న గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన సోదరులకు మరోసారి ప్రజల ముందు నిలబడే నైతికత లేదని విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తాను పోటీ చేస్తానన్నారు. ఓబుళాపురం గనుల్లో జరిగిన అక్రమాలపై గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తాను ఎన్నికల్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని చెప్పారు.

ఆయన చేసిన అక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడమే కాకుండా గాలి ఆస్తుల జప్తు కోరుతానన్నారు. ఇందుకు సమాజ పరివర్తన సమితి, జన సంగ్రామ పరిషత్‌కు చెందిన ఎస్ ఆర్ హిరేమఠ్, రాఘవేంద్ర కుష్టిగిలాంటి ప్రజా సంఘాల నాయకులతో చర్చిస్తానన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా.. తన అభిప్రాయాలు, ఆలోచనలకు మద్దతు ఇచ్చే పార్టీ తరపున, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+