తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ ఆంగ్లేయుడు:వర్షంలో నల్లడ్రెస్‌తో భూమన నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhumana Karunakar Reddy
చిత్తూరు: తెలుగు మహాసభల నిర్వహణ తీరును నిరసిస్తూ తిరుపతి శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో వినూత్న నిరసన తెలిపారు. ఆయన ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లలో ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ ఆయన నల్లబట్టలతో నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.

దీంతో ఆయన వర్షంలోనే నల్లబట్టలతో తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆన మాట్లాడారు. ఏర్పాట్లలో తెలుగు భాషను అవమానపరుస్తున్నారని భూమన దుయ్యబట్టారు. ఆంగ్ల పదాలు వాడటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంగ్లేయుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు ప్రపంచ తెలుగు మహా సభలు అని చెబుతూనే మరోవైపు భాషను అవమానపరిస్తే ఊరుకునే సమస్య లేదన్నారు.

తెలుగు మహాసభలను కాంగ్రెసు పార్టీ మేళాగా నిర్వహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనకు చాలా బాధ కలిగించాయన్నారు. సచివాలయం, తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుగు భాష అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల అమలుకే దిక్కులేదని భాషాభిమానులు వాపోతున్నారని విమర్శించారు.

English summary
Tirupati MLA Bhumana Karunakar Reddy said CM Kiran Kumar Reddy is England man. He was opposing English letters in Prapancha Telugu Mahasabalu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X