లవర్స్‌తో లేచిపోతున్నారని: గర్ల్స్ సెల్‌ఫోన్ వాడితే ఫైన్

తాజాగా బీహార్‌లోనూ ఇది బయటపడింది. పెళ్లయిన యువతులు.. భర్తలను వదిలి ప్రేమికులతో లేచిపోతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు పంచాయతీ పేర్కొంది. యువతులు ఇతర కులాలు, మతాల వారిని ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటుండడంతో ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీరు అమ్మాయిలు భర్తలను వదిలి లేచిపోతున్నారని తీర్మానం చేశారు.
బీహార్‌లోని సుందర్‌వాడి పంచాయతీ ఈ తీర్మానం చేసింది. అమ్మాయిలు సెల్‌ఫోన్ వినియోగిస్తే పదివేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. అయితే.. ఈ విషయం వార్తా పత్రికల్లో ప్రచురితం అయిన తర్వాతే తమకు తెలిసిందని, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని అక్కడి బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications