జూ ఎన్టీఆర్‌కు తాకుతుందనే: బాలయ్యతో మారిన సీన్

ఆ సమయంలో జిల్లా నేతలు కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత ఆ విషయాన్ని దాదాపు మర్చిపోయారనే చెప్పవచ్చు. అయితే అందుకు ఓ కారణముందట. నాని హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడు కావడంతో ఆయనను తాము ఏమైనా అంటే జూనియర్‌కు తగులుందేమోననే ఆందోళన వారిని వెంటాడిందంట. అందుకే ఇన్నాళ్లూ వారు నానిపై అంతగా దూకుడు ప్రదర్శించలేదంట.
నాని చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేసినప్పుడు ఒకరిద్దరు నేతలు ఖండించడం, నానిని విమర్శించడం మాత్రమే చేశారు. కానీ టిడిపి సొంత నియోజకవర్గంగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే బయటకు వెళితే పార్టీ నేతలు ఆ స్థాయిలో స్పందించలేదనే భావన తెలుగు తమ్ముళ్లలో నెలకొందట. అయితే జూనియర్ కారణంగా వారు వెనక్కి తగ్గారట. కానీ ఇటీవల బాలకృష్ణ గుడివాడ వచ్చి పరోక్షంగా నానికి వార్నింగ్ ఇవ్వడంతో జిల్లా నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చిందంటున్నారు.
బాలయ్య వచ్చి జూనియర్, కొడాలి నాని వేరు వేరు అని చెప్పకనే చెప్పారని అంటున్నారు. దీంతో ఇక నానిపై వరుస మాటల దాడి చేసేందుకు జిల్లా పార్టీ నేతలు సిద్ధమయ్యారట. బాలయ్య వచ్చి వెళ్లిన తెల్లారి గుడివాడలో రావి వెంకటేశ్వర రావు పార్టీ మారిన నానిపై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత జిల్లా నేతలు అందరూ కల్సి మీడియా సమావేశంలో నానిపై దుమ్మెత్తి పోశారు. చివరకు బాలయ్య అభిమానులు కూడా నానిపై రెచ్చిపోయారు.












Click it and Unblock the Notifications