హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాపై 3 నిమిషాల్లోనే, వారిని ఉపేక్షిస్తున్నారు: కొడాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodali Nani
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసిన మూడు నిమిషాల్లోనే తనకు తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసిందని, రాజ్యసభకు డుమ్మా కొట్టిన ముగ్గురు ఎంపిలను మాత్రం ఉపేక్షిస్తోందని గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఎఫ్‌డిఐలపై ఓటింగుకు దూరమైన ఎంపిలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఆయన అడిగారు.

రాజ్యసభకు డుమ్మా కొట్టిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కూడా ముడుపులు తీసుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వేళ వారు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ ముగ్గురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఎంతకు అమ్ముకున్నాడో చంద్రబాబు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు ఆ ముగ్గురు ఎంపిల వ్యవహారంపై డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఎఫ్‌డిఐలపై ఓటింగు సందర్భంగా ఎంపిలకు విప్ ఎందుకు జారీ చేయలేదని ఆయన శనివారం అడిగారు. ఈ వ్యవహారంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య అవినాభావ సంబంధం బయటపడిందని ఆయన అన్నారు.

చంద్రబాబు గల్లీలో కాంగ్రెసును విమర్శిస్తూ ఢిల్లీలో రక్షిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు అనుమతితోనే ఎంపిలు రాజ్యసభకు గైర్హాజరయ్యారని ఆయన ఆరోపించారు. ఎంపిల గైర్హాజరుపై చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ ఎంపిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎఫ్‌డిఐల అంశంపై రాజ్యసభలో ఓటింగు సమయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన మెదక్‌లో పిలుపునిచ్చారు.

తెలంగాణపై అఖిలపక్షమంటూ కాంగ్రెసు పార్టీ నాటకాలాడుతోందని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అవగాహన కోసమే అఖిల పక్ష సమావేశమని ఆజాద్ అనడం సరి కాదని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంల తన గైర్జాజరీపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ శనివారం వివరణ ఇచ్చుకున్నారు. తాను చంద్రబాబుకే చెప్పే రాజ్యసభ నుంచి వెళ్లిపోయానని ఆయన అన్నారు. మిగతా ఇద్దరు ఎంపీల గైర్జాజరీపై కూడా పార్టీకి సమాచారం ఉందని ఆయన చెప్పారు. తమను బాధ్యులను చేసే విధంగా ప్రచారం సాగుతుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బిఎస్పీ మద్దతుతో ఎఫ్‌డిఐలపై ప్రభుత్వం గట్టెక్కుతుందని భావించి తమ ఓటుకు విలువ ఉండదని అనుకున్నామని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader and Gudivada MLA Kodali Nani lashed out at Telugudesam party president N Chandrababu Naidu on the absence of three party MPs to the Rajyasabha during voting on FDIs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X