చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాంబారులో పాము: ఇంకా షాక్‌లోనే ఉన్న మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Snake in Sambar
చెన్నై: మూడు రోజుల క్రితం ఆహార పదార్థాల్లో పామును చూసిన ఓ మహిళ ఇంకా కోలుకోలోకపోతోంది. తమిళనాడులోని వడక్కపట్టులో మంగమ్మాయ్ అనే మహిళ డిసెంబర్ 4వ తేదీన చీకట్లో వంటలు చేసింది. విద్యుత్ లేకపోవడంతో గ్రామమంతా అంధకారం అలుముకుంది. మర్నాడు ఉదయం 47 ఏళ్ల మహిళ పాత్రలు శుభ్రం చేయడానికి సిద్ధపడినప్పుడు సాంబారు చేసిన పాత్రలో చిన్నపాటి పాము అస్తిపంజరం కనిపించింది. కొద్దిగా మిగిలిన కర్రీలో అది కనిపించింది.

మంగమ్మాయ్ ఆ అస్తిపంజరాన్ని ఇరుగుపొరుగువారికి చూపించింది. చివరకు అది నాగుపాము అస్తిపంజరం అని ఒకరు గుర్తించారు. ఇంతలోనే ఆమెను అస్వస్థత ఆవరించింది. వాంతులు చేసుకుని స్పృహ తప్పింది. గ్రామంలోని క్లినిక్‌కు ఆమెను తరలించారు.

పాము కుట్టినప్పుడు శరీరంలోకి ఎక్కే విషం లాంటి సూచనలే మంగమ్మాయ్‌లో కనిపించాయి. మంగమ్మాయ్‌ని ఆ తర్వాత తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మళ్లీ ఆరో తేదీన ఆమె వాంతులు చేసుకుంది. తన చుట్టూ పాములు కనిపిస్తున్నాయని ఆమె భర్తతో అనడం సాగించింది.

ఆ తర్వాత చెకప్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు తేలింది. మంచి చికిత్స అందిస్తున్నప్పటికీ భయంతో దాని నుంచి కోలుకోలేకపోతోంది. ఆమె మానసికంగా దెబ్బ తిన్నదని వైద్యులు అంటున్నారు. సాంబారులో మీకు పాముల అస్తిపంజరాలు కనిపిస్తాయోమో, జాగ్రత్తగా చూడండని ఆమె తన బంధువులతో అంటోంది.

అయితే, అందులోని అస్తిపంజరం పాముదై ఉండదని, బల్లిది గానీ, లేదా చేప ఎముకలు గానీ అయి ఉంటాయని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ ప్రతాప్ అంటున్నారు. మంగమ్మాయ్ సమస్య మానసికమైందని, ఈ చికిత్స ద్వారా అది ఆమె కోలుకునే అవకాశాలు లేవని అంటున్నారు.

English summary
A hearing-impaired woman in Tamilnadu is yet to recover from the shock of finding a snake's remains in her food three days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X