పురంధేశ్వరిపై ఎన్టీఆర్ అభిమానులకు చంద్రబాబు లేఖ

అప్పుడు మౌనం వహించిన ఆమె ఇప్పుడు మాత్రమే ఎందుకు పెదవి విప్పారో చెప్పాలన్నారు. తెలుగు మహాసభల పుస్తకాల్లో ఎన్టీఆర్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఎన్టీఆర్‌కు అవమానం జరిగినా ఆమె పెదవి విప్పడం లేదన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నారు. ఆ దిశలో పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 7న పురంధేశ్వరి రాసిన లేఖ పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని ఆయన చెప్పారు. కాగా ఇటీవల పార్లమెంటులో నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టేందుకు స్పీకర్ మీరా కుమార్ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘం అనుమతించిందని, విగ్రహాన్ని ఇవ్వాలని పురంధేశ్వరికి స్పీకర్ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications