వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండురెండు కూడితే ఆరు: జగన్‌వైపు ఎమ్మెల్యేలపై కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: పార్టీ నుండి 150 మంది పోయినా కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చాలా బాగుందని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నంత ఇబ్బందికరంగా ఏమీ లేదన్నారు. ఆయన ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు సాధారణమని, దాని గురించి ఆలోచించాల్సినదేమీ లేదన్నారు.

నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి నూటా యాభై మంది ఎమ్మెల్యేలు రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లి పోయారని, అయినా తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని గుర్తు చేశారు. రాజకీయాలంటే గణాంకాలు కాదన్నారు. రెండు రెండు కూడితే లెక్కల్లో నాలుగు వస్తుందని కానీ, రాజకీయాల్లో ఆరు కూడా రావొచ్చునని చెప్పారు.

1999లో కార్గిల్ యుద్ధం కారణంగా బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత ధరల పెరుగుదలతో ఓడిపోయిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల వలసల కంటే క్షేత్రస్థాయిలో నాయకుల వలసలకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అన్నీ సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్‌లో ఎవ్వరూ పార్టీ కంటే పెద్దవారు కాదన్నారు.

పార్టీ ద్వారానే ఈ పదవులు, హోదాలు వచ్చాయన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. సంక్రాంతిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. ఎన్నాళ్లు పార్టీలో ఉన్నా గుర్తింపు రాలేదంటూ రాజీనామా చేసిన కావూరి సాంబశివ రావు అంశాన్ని ప్రస్తావించగా.. ఆయన చాలా సీనియర్ అని, ఆ విషయం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said Congress party is not in fear of MLAs who are jumping in to other parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X