శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాన్నదారిలో నడుస్తా:శ్రీకాకుళం రామ్మోహన్‌నాయుడికే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rammohan Naidu
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా లోకసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా దివంగత కింజారపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడిని పార్టీ ఆదివారం నియమించింది. గత నెలలో రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎవరిని పోటీకి దింపాలనే అంశంపై టిడిపి ఓ నిర్ణయానికి వచ్చి రామ్మోహన్ నాయుడిని ఇంచార్జిగా నియమించింది.

కాగా రామ్మోహన్ నాయుడు గత సోమవారం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నిజామాబాద్ జిల్లా వస్తున్నా మీకోసం పాదయాత్ర సమయంలో కలిసిన విషయం తెలిసిందే. రామ్మోహన్ నాయుడుతో తన చిన్నాన్న అచ్చెన్నాయుడు కూడా వెంట వచ్చారు. వీరి భేటీలో రామ్మోహన్ నాయుడు రాజకీయ భవిష్యత్తు చర్చకు వచ్చింది. అచ్చెన్నాయుడు సోదరుడి కుమారుడికి అండగా ఉండనున్నారు.

ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు పేరునే అందరూ సూచించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎర్రన్నాయుడు ఉన్నన్నాళ్లూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు, సోదరుడు... ఇలా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు తాను రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ కూడా ఆయన రాజకీయ వారసుడిగా రామ్మోహన్ నాయుడును ఎంపిక చేసింది. శ్రీకాకుళం లోకసభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడును నిలపాలని పార్టీ అప్పటికే నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు రామ్మోహన్ నాయుడును ఇంచార్జిగా నియమించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడే పోటీ చేయనున్నారు.

కాగా రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు తనపై నమ్మకాన్ని ఉంచి ఈ బాధ్యతలు అప్పగించారని దానిని నిలబెట్టుకుంటానని చెప్పారు. తన తండ్రి పార్టీ కోసం ఎలా చిత్తశుద్ధితో పనిచేశారో తాను అలాగే పని చేస్తానన్నారు. పార్టీ కోసం అహర్నిషలు పాటుపడుతానన్నారు.

English summary
Kinjarapu Rammohan Naidu, who is son of late Errannaidu has appointed as Party Srikakulam Lok Sabha incharge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X