చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పుట్టిన రోజు క్యాలెండర్ విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
చిత్తూరు: ఈ నెల 21వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జగన్ బర్త్ డే క్యాలెండర్‌ను విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో శాసనమండలి సభ్యుడు తిప్పా రెడ్డి ఈ బర్త్ డే క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మదనపల్లెలో జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21, 1972లో కడప జిల్లా పులివెందులలో జన్మించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత తనపై కాంగ్రెసు పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆయన గతేడాది వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సొంతకుంపటి పెట్టుకున్నారు. ఆయన ఆస్తులపై సిబిఐ విచారణ సాగుతోంది. ఆరు నెలల క్రితం మే 27న ఆయనను సిబిఐ ఆస్తుల కేసుకు సంబంధించి అరెస్టు చేసింది.

జగన్ జైలులో ఉన్నప్పటికీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి భారీగా నేతలు వైయస్సార్ కాంగ్రెసు వైపు క్యూ కడుతున్నారు. జగన్ పార్టీ పెట్టాక సీమాంధ్రలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీయే ఘన విజయం సాధించింది. కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెసు గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేదు. ఇటీవల జగన్ చూపు తెలంగాణపై పడింది.

సీమాంధ్రలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ముచ్చెమటలు పోయిస్తున్న జగన్ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి వణుకు పుట్టిస్తున్నారు. వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఓటమి చెందారు. టిఆర్ఎస్ చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచింది. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ బయటలేకున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది.

English summary
YSR Congress party leader and MLC Tippa Reddy has launched YS Jaganmohan Reddy's birth day calender on Sunday in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X