తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జంప్‌లకు కేంద్రంగా జైలు: జగన్‌పై యనమల, ఒక్కరినే

By Pratap
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
తిరుపతి: పార్టీ ఫిరాయిపులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉన్న హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు కేంద్రంగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైయస్ జగన్‌ను జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుకు దాసోహమంటోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద యెత్తున డబ్బులు దాచి పెట్టారని ఆయన ఆరోపించారు. జగన్‌కు చెందిన లోటస్‌పాండులో, ఇడుపులపాయలో సోదాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలను ఆ స్థలాల్లో దాచిపెట్టారని ఆయన అన్నారు.

తమ ముగ్గురు ఎంపిలు ఎఫ్‌డిఐలపై ఓటింగు సందర్భంగా రాజ్యసభకు ఉద్దేశ్యపూర్వకంగా గైర్హాజరు అయినట్లు అనిపించడం లేదని ఆయన అన్నారు. తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా క్షమించదని ఆయన అన్నారు. అయితే, కావాలని వారు గైర్హాజరైనట్లు కనిపించడం లేదని, అయితే తుది నిర్ణయం మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే తీసుకుంటారని ఆయన అన్నారు.

రాజ్యసభకు గైర్హాజరైన ఎంపీలు రాతవూర్వకంగా వివరణ ఇచ్చారని, ఏం చేయాలనే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. కావాలని గైర్హాజరు అయి ఉంటే పార్టీ చర్యలు తీసుకుంటుందని, కానీ అలా అనిపించడం లేదని ఆయన అన్నారు. పొరపాటు జరిగిందని దేవేందర్ గౌడ్ అంటున్నారని, తప్పు చేశామని మిగతా ఎంపీలు అంగీకరిస్తున్నారని, తాము పార్టీలోనే ఉంటామని కూడా చెబుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ నుంచి ఒక్క ప్రతినిధిని మాత్రమే పంపిస్తామని ఆయన అన్నారు. తమ నిర్ణయంపై ఎందరు బయటకు వెళ్లినా పార్టీకి నష్టం లేదని ఆయన అన్నారు.

English summary
Telugudesam senior leader Yanamala Ramakrishnudu criticised that YSR Congress party president YS Jagan was using Chanchalguda jail as centre for defections. He said that party will send one representative to the all party meeting to be held on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X