ఫుట్‌బోర్డ్ ప్రయాణం: చెన్నైలో 4గురు విద్యార్థుల మృతి

ముగ్గురు విద్యార్థులు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వెళ్లే మార్గంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ట్రక్కు మధ్య ఇరుక్కొని విద్యార్థులు మృతి చెందారని, వారు స్థానికంగా ఉన్న ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నారని పోలీసులు తెలిపారు.
హైదరాబాదులో...
హైదరాబాదులోని లక్డీకాపూల్‌లోని లోటస్ ఆసుపత్రి ఎదుట సోమవారం ఉదయం బైక్ పైన వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న మహిళ మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications