వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐరాస అడ్వైజర్‌‌గా తాలిబన్ మలాలా యూసఫ్ తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Malala Yousufzai
న్యూయార్క్: తాలిబన్ల కాల్పుల్లో గాయపడిన పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయి మలాలా యూసఫ్‌జాయ్ తండ్రి, ప్రధానోపాధ్యాయుడు జియావుద్దీన్ యూసఫ్‌జాయ్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విద్య ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. బాలికలకు విద్య అందాలని మలాలా గళమెత్తడం తాలిబన్లు ఆమెను టార్గెట్ చేసుకొని కాల్చడం తెలిసిందే. ఇప్పుడు ఆమె తండ్రికి యుఎన్ సలహాదారు పదవి కట్టబెట్టారు.

బ్రిడన్ మాజీ ప్రధాన గార్డన్ బ్రౌన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రౌన్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విద్య ప్రత్యేక రాయబారి. మలాలా పూర్తిగా కోలుకున్నాక ఆమె తమ ప్రచారంలో పాల్గొంటుందని చెప్పారు. బాలికల విద్య కోసం మలాలా పేరుతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నిధికి పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ దాదాపు రూ.55 కోట్ల విరాళం ప్రకటించారు. మలాలా ప్రస్తుతం లండన్‌లో ఉంది.

కాగా పాకిస్తాన్‌లో తాలిబన్లు ఇటీవల పద్నాలుగేళ్ల మలాలాపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా, విద్యకు అనుకూలంగా గళం విన్పించిందనే ఆగ్రహంతో ఓ బాలిక కార్యకర్తపై కిరాతంగా కాల్పులు జరిపారు. తమ దుశ్చర్యలను దనుమాడిందనే దుగ్దతో ఆ చిన్నారిపై హత్యాయత్నం చేశారు.

బాలికా విద్యపై ఇస్లాం తీవ్రవాదుల వైఖరిని వ్యతిరేకించి చిన్నవయసులోనే అత్యంత ధీశాలిగా పాకిస్థాన్‌లో ఖ్యాతికెక్కిన మాలాల యూసఫ్‌ జాయ్‌ను అంతం చేసేందుకు ప్రయత్నించారు. బడి నుంచి పాఠశాల బస్సులో ఇంటికి వెళుతున్న మాలాలపై కర్కశ దుండగుడొకడు తుపాకీతో రెండుసార్లు కాల్చాడు. ఆమె ఆ తర్వాత లండన్‌లో చికిత్స పొందుతున్నారు.

English summary
The father of Pakistani school girl Malala Yousufzai, who was shot by the Taliban for advocating girls right to education, has been named as the Special UN advisor on Global Education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X