వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Pandit Ravishankar
శాంటియాగో: ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మంగళవారం కన్నుమూశారు. అమెరికాలోని శాంటియాగోలో ఆయన తుది శ్వాస విడిచారు. రబింద్రో శౌంకర్ చౌదరి అయిన పండిట్ రవిశంకర్ 1920 ఏప్రిల్ 7వ తేదీన వారణాసిలో జన్మించారు. సమకాలీన సంగీత విద్వాంసుల్లో ఆయనకు సాటి వచ్చేవారు లేరు. ఆయనకు 92 ఏళ్లు.

శ్వాస తీసుకోవడంలో ఏర్పడిన సమస్యల వల్ల ఆయన మరణించారు. భారత సంగీతాన్ని పాశ్చాత్య దేశాల్లోకి తీసుకుని వెళ్లడంలో ఆయన విశేష కృషి సలిపారు. లాల్ జొల్లాలోని స్క్రిప్స్ మెమోరియల్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. గతవారం రవిశంకర్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడాలని అనుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్‌లో రాశాడు.

పండిట్ రవిశంకర్‌కు భార్య సుకన్య, కూతుళ్లు సితార విద్వాంసురాలు అనుష్కా శంకర్, గాయని నోరహ్ జోన్స్ ఉన్నారు. కచ్చేరీలకు తోడుగా ఉండే కుమారుడు సుభేంద్ర శంకర్ 1992లో మరణించాడు. జీవితాంతం వరకు సంగీత రంగంలో క్రియాశీలకంగా ఉన్నారు.

భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఆయనను 1999లో వరించింది. మూడు సార్లు ఆయన గ్రామీ అవార్డులు అందుకున్నారు. చాంట్స్ ఆప్ ఇండియా, ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా, త్రీ రాగాస్, ది సౌండ్స్ ఆఫ్ ఇండియా వంటి పలు ఆల్బమ్స్‌ను ఆయన వెలువరించారు. భారత శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య ప్రపంచంలో విశేష గుర్తింపును ఆయన సాధించి పెట్టారు.

English summary
Legendary musician, Pandit Ravi Shankar passed in San Diego on Tuesday. He was 92. The musician was admitted to the Scripps Memorial Hospital in La Jolla last Thursday after he complained of breathing difficulties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X