ఎక్కువ ఊహించుకోవద్దు, ఆటపైనే దృష్టి: ఇర్పాన్

రాజకీయాలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని, రాజకీయాల పట్ట తనకు ఆసక్తి లేదని అన్నారు. తాను క్రికెటర్‌ను అని, బరోడాలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచులో అయిన గాయం నుంచి తాను కోలుకుంటున్నానని ఆయన ఓ వార్తా సంస్థతో అన్నారు.
గుజరాత్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖేడాకు వచ్చిన మోడీతో పాటు ఇర్పాన్ పఠాన్ వేదికను పంచుకోవడంపై ఊహాగానాలు చెలరేగాయి. డిసెంబర్ 17వ తేదీన గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ జరగనుంది. గుజరాత్ శానససభ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ 87 స్థానాలకు పోలింగ్ జరిగింది.
బిజెపి మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. భారీ వేదికపై మోడీతో పాటు ఇర్ఫాన్ పఠాన్ కనిపించాడు. వడొదరకు చెందిన ఇర్పాన్ పఠాన్ మోడీ సభకు హాజరయ్యారు. అయితే, ఆయన ఏ విధమైన ప్రసంగం లేదు. కానీ, ప్రజల వైపు రెండు చేతులతో ప్రజలకు అభివాదం చేశారు. మోడీ ప్రసంగం వినడానికి మాత్రమే ఇర్పాన్ వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications