భేటీపై చిరంజీవి అభిమానుల అలక: ప్రత్యేక సమావేశం?

సదస్సులో....
సదస్సులో పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడుసార్లు ప్రధాని పదవి వద్దన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై విపక్షాల విమర్శలు తగవన్నారు.
తెలంగాణ ఎంత ముఖ్యమో దళిత గిరిజన అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎవరికి జిందాబాద్‌లు కొట్టవద్దని కేవలం సోనియాకే కొట్టాలన్నారు. ఒకప్పుడు ప్రణాళికలు లేకుండా నిధులు విడుదలయ్యేవని, సబ్ ప్లాన్ ఆలోచన ఇందిరా గాంధీదే అన్నారు. సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అన్నారు. సమాజంలో అసమానతలు తొలగి పోవాలన్నారు. అప్పటి వరకు పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజి వర్గం వాటా సరే కానీ స్వేచ్ఛ లేదన్నారు.
చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. ఆయన 8 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కెసిఆర్ పాలమూరులో ముస్లిం అభ్యర్థి ఇబ్రహీంను గెలిపించలేక పోయారని ఇక ఉప ముఖ్యమంత్రి ఎలా చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications