హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టులో తెలంగాణ ఆందోళన: లాయర్ల విచారణకు ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న న్యాయవాదులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం శనివారం ఆదేశాలు జారీ చేసింది. 24 మంది న్యాయవాదులపై ఐపిసి, ప్రభుత్వం ఆస్తుల ధ్వంసం చట్టం కింద విచారణకు అనుమతి మంజూరు చేసింది. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని.. న్యాయాధికారుల పోస్టుల్లో 42 శాతం తెలంగాణ న్యాయవాదులతో భర్తీ చేయాలంటూ లాయర్లు 2010లో ఉద్యమించిన విషయం తెలిసిందే.

కొందరు న్యాయవాదులు కోర్టు హాళ్లలోని ఫర్నిచర్‌ను, లైట్లను ధ్వంసం చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు కూడా ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కార కేసును సుమోటోగా నమోదు చేసి విచారణ జరుపుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. హైకోర్టులో జరిగిన ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని సుప్రీం కోర్టు గతంలో ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో 24 మంది న్యాయవాదులపై ఐపిసిలోని సెక్షన్ 147, 506, 323, 186, 228, 153ఏ రెడ్‌విత్ 149, ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం సెక్షన్ 3 కింద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ జివో ఆర్.టి. నెంబర్ 2348 జారీ అయింది.

హైకోర్టు న్యాయవాదులు భాగ్యమ్మ, మంజుల, వెంకట యాదవ్, భిక్షపతి, విప్లవ రెడ్డి, జలకం సంపత్, గోపిరెడ్డి చంద్రశేఖర రెడ్డి, పాశం కృష్ణా రెడ్డి, రాఘమ్మ, క్రిమినల్ కోర్టు న్యాయవాదులు బుచ్చిరెడ్డి, నాగుల శ్రీనివాస్, రాజవర్ధన్ రెడ్డి, సంపూర్ణ దేవి, వెంకటేష్, మానిక్ ప్రభు, మానిక్ రెడ్డి, సిటి సివిల్ కోర్టు న్యాయవాదులు అశోక్, సంతోష్ సింగ్, శశాంక్ గోయల్, చంద్రయ్య యాదయ్య, రూపాసింగ్, శ్రీనివాస్ గౌడ్, రవీంద్రనాథ్, రంగారెడ్డి జిల్లా లాయర్ చెన్నవీరయ్యలు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కాగా వీరు పరారీలో ఉన్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

English summary
Govt releases New GO To Prosecute T Lawyers based on Supreme Court Orders for attacks in High Court 2010
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X