ఆస్తి ధ్వంసం: వైయస్ జగన్‌పై విచారణ ఉపసంహరణ

కాగా కడప జిల్లాలోని పులివెందుల పోలీసు స్టేషన్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు అక్టోబర్ 10, 2011లో కేసు నమోదు చేశారు. జగన్‌తో సహా మరికొందరిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై వచ్చిన అభియోగాలపై మొత్తం పదకొండు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం తదితర అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
అంతకుముందు రోజు ఆదివారం సాయంత్రం జగన్ పులివెందుల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కార్యకర్తలను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications