వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్! స్థాయి మించకు: ఎర్రబెల్లి, నమ్మట్లేదని జగ్గారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Erraballi Dayakar Rao - Jagga Reddy
వరంగల్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం సవాల్ విసిరారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విమలక్కను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విమలక్క అరెస్టులో తెరాస పాత్ర ఉందని ఆరోపించారు.

ఆమెను ప్రభుత్వం భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారన్నారు. అలాగే మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు తెలంగాణ కోసం ధర్నా చేసే దమ్ము కెసిఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ పార్టీలు కల్సినా అధికారంలోకి రాలేవన్నారు.

కాకతీయ ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తుందన్నారు. అరకొర నిధులతో ఉత్సవాలను ఎలా జరుపుతారని ప్రశ్నించారు. అవసరమైతే టిడిపియే మేధావులతో కలిసి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ నెల 28లోగా కాంగ్రెసు నేతలు సోనియా నివాసం ముందు ధర్నా చేయాలన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు అవినీతిపరులు అని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విమలక్కను వెంటనే విడుదల చేయాలని సీతక్క అన్నారు.

సీట్ల కోసమే

కెసిఆర్ సీట్ల కోసమే పల్లెబాట పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. రోజుకో మాట మాట్లాడే కెసిఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 సీట్లను కూడా గెల్చుకోలేరన్నారు.

మూడు ముక్కలు

ఈ నెల 28న జరిగే అఖిలపక్, సమావేశం తర్వాత కూడా కాంగ్రెసు తెలంగాణపై తన వైఖరి చెప్పని పక్షంలో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ మూడు ముక్కలవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణపై నాన్చుడు ధోరణి సరికాదన్నారు.

English summary

 TDP leader Erraballi Dayakar Rao warned TRS Chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X