కెసిఆర్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటే: సురేఖ

తెలంగాణ అమరుల రక్తం తాగి తెరాసను కెసిఆర్ బలోపేతం చేసుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటే ఉద్యమం చల్లారుతుందని, బయటకు వస్తే మొదలవుతుందని, ఓ పదిమంది విద్యార్థులను బలి చేసి సోనియా గాంధీతో ప్యాకేజీ మాట్లాడుకోవడం కెసిఆర్‌కు అలవాటుగా మారిందని ఆమె దుయ్యబట్టారు.
28న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ లేఖ ఇస్తే ఎన్ని రోజుల్లో తెలంగాణ తెస్తారో తెరాస చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆలోగా తెలంగాణను తేకపోతే తెరాస నేతలు తమ పార్టీలోకి రావాలని, ఒకవేళ తెలంగాణ తెస్తే తాము తెరాస వెనకాల నడుస్తామని సురేఖ అన్నారు.
ఒక్కో పార్టీ నుంచి ఇద్దరిని పిలిచి సమస్య నాన్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ప్రతి పార్టీ నుంచి ఒక్కరినే పిలిచి తెలంగాణ అంశాన్ని తేల్చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడానికి తాను కృషి చేస్తానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications