అఫ్జల్ గురుకి ఉరి వేయొద్దు: అంబేడ్కర్ మనవడు

భారత్ ఫండమెంటల్ హిందూ నేతలతో పాలింపబడటం లేదన్నారు. భారత్ లౌకికవాద దేశం అని తెలుసుకోవాలన్నారు. అఫ్జల్ గురును ఉరి తీయాలని డిమాండ్ చేయడం ఓటు బ్యాంకు రాజకీయాలో భాగమేనని ప్రకాశ్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఈ డిమాండ్ చేస్తున్న పార్టీలకు దేశ ప్రయోజనాలపై ఏమాత్రం ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు.
కాగా పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు పూణేలోని యెరవాడ జైలులో గత నెల 21వ తేదిన ఉరితీసిన విషయం తెలిసిందే. ముంబై ఉగ్రవాద దాడుల్లో దోషిగా తేలిన కసబ్‌కు ఆ రోజు ఏడున్నర గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కసబ్ పెట్టుకున్న మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో కసబ్‌ను ఉరితీశారు. కసబ్ ఉరి తర్వాత అఫ్జల్ గురు ఉరి తెరపైకి వచ్చింది. అఫ్జల్ క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా రాష్ట్రపతి తోసి పుచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications