వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమతిస్తే అల్లూరి విగ్రహమిస్తా: స్పీకర్‌కు కృష్ణంరాజు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Alluri Sita Rama Raju-Krishnam Raju
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిష్టించేందుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తాను ఇస్తానని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ నటుడు కృష్ణం రాజు లోకసభ స్పీకర్ మీరా కుమార్‌ను సోమవారం అభ్యర్థించారు. అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అనుమతించిన పక్షంలో తాను విగ్రహాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. మాజీ పార్లమెంటు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో పాటు పార్లమెంటుకు వచ్చిన ఆయన మధ్యాహ్నం స్పీకర్‌ను కలిశారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఇచ్చేందుకు పురందేశ్వరిని అనుమతించారని, అదే విధంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇచ్చేందుకు తనకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అల్లూరి విగ్రహ ఏర్పాటుకు 2000లో స్పీకర్‌గా ఉన్న జిఎంసి బాలయోగి అనుమతించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాలు ఇవ్వాల్సి ఉండగా, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇస్తామంటూ 2006లో ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 12, 13వ లోక్‌సభలకు తాను ప్రాతినిధ్యం వహించానని కృష్ణం రాజు తెలిపారు.

అల్లూరి విగ్రహంపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రస్తావించగా రూ.25 లక్షల వ్యయమయ్యే ఈ విగ్రహాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. గతంలోనే అల్లూరి విగ్రహ ఏర్పాటుకు స్పీకర్ అనుమతి ఇచ్చారని, మళ్లీ అనుమతి పొందాల్సిన అవసరం లేదని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు.

English summary
Former Central Minister Krishnam Raju asked LS speaker to allow him to pay for Alluri Sitaramaraju statue in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X