హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడింటిపై నిప్పులు చెలరేగిన అంబటి: కిరణ్‌కు కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం కౌంటర్ ఇచ్చారు. జగన్ ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసమో, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసమో పోరాడి జైలుకు వెళ్లలేదని ముఖ్యమంత్రి నిన్న ఇందిరమ్మ బాట కార్యక్రమంలో అన్నారు. దీనిపై అంబటి ఈ రోజు హైదరాబాదులో స్పందించారు.

జగన్ కాంగ్రెసు పార్టీ తనను వేధిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారని, ఉప ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని, జన బలం క్రమంగా పెంచుకుంటున్నారనే ఉద్దేశ్యంతో అరెస్టు చేశారన్నారు. కాంగ్రెసును కాదన్నందుకే జగన్ జైలుకు జైలుకు వెళ్లారన్నారు. అన్యాయంగా జగన్‌ను జైలులో పెట్టి ఇప్పుడు కాకమ్మ కథలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెసుకు 24 సీట్లు గెలిచిన రికార్డు ఉందని, కిరణ్ హయాంలో 2014లో అది 16 అవుతుందన్నారు.

ముఖ్యమంత్రి ప్రజలకు పాత చింతకాయ కథలు చెప్పడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఉన్నట్లుగా ఏమాత్రం కనిపించడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనా అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. టిడిపి ఎంపి సుజనా చౌదరి రాజీనామాను బాబు తిరస్కరిస్తారనే విషయం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. టిడిపి ఎంపీలు అందరూ బాబుకు తెలిసే రాజ్యసభలో ఎఫ్‌డిఐ ఓటింగు సమయంలో గైర్హాజరయ్యారని ఆరోపించారు.

చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ తీవ్ర ష్టాల్లో ఉందని, దానిని లాభాల్లోకి తీసుకు రావడానికి విదేశీ పెట్టుబడులు అవసరమన్నారు. అందువల్లే ఆ బిల్లు సమయంలో వారు ప్రభుత్వానికి సహకరించే విధంగా గైర్హాజరయ్యారన్నారు. హెరిటేజ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టకుండా ఉండగలరా అని తాము చేసిన సవాల్‌కు అటు నుండి ఇంత వరకు స్పందన రాలేదన్నారు. బాబుతో కాంగ్రెసు కుమ్మక్కయిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ హింసావాదన్ని ప్రోత్సహించలేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాలికి ఆపరేషన్ జరిగిందని, మూడు వారాల విశ్రాంతి అనంతరం ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడే ప్రారంభిస్తారని చెప్పారు.

English summary
YSR Congress party spokes person Ambati Rambabu has lashed out at TDP chief Nara Chandrababu Naidu and CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X