హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌ది అవినీతి పాలన, బాబు కాపీ మాస్టర్: సిఆర్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం సామాజిక ద్రోహం అనటం సరికాదన్నారు. రాజ్యాంగ బద్దంగా ప్రజారాజ్యం విలీన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు వెన్ను పోటు పొడిచిన విషయమేమిటని ప్రశ్నించారు.

నగదు బదలీ పథకం తనదని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. అది ఇతర దేశాల్లో ఎప్పటి నుండో అమలులో ఉందన్నారు. ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టడంలో బాబును మించిన వారు లేరన్నారు. నగదు బదలీ ఆలోచన తనదే అని బాబు చెప్పడం సరికాదన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్ అంటున్నారని.. కానీ గతంలో దానిని వ్యతిరేకించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఇతరుల పథకాలను తన పథకాలుగా చెప్పుకోవడంలో బాబును మించిన వారు లేరన్నారు. ఆయన పెద్ద కాపీ మాస్టర్ అని విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత లేదని.. ముందు ముందు కూడా రాదన్నారు. పాదయాత్ర, మహా కూటమి, ఉచిత విద్యుత్ ఇవన్నింటిని బాబు కాపీ చేశాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అవినీతి పాలన అని ధ్వజమెత్తారు.

వైయస్ హయాంలో పని చేసిన మంత్రులు పదవుల్లో కొనసాగాలా వద్దా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. వైయస్ అవినీతిలో మంత్రుల ప్రమేయం ఉందా లేదా అనే అంశాన్ని సిబిఐ తేల్చుతుందన్నారు. అవినీతి అని తేలితే మంత్రులు కేబినెట్లో ఉండటం సరికాదని.. అయితే తప్పించే శక్తి తనకు లేదన్నారు.

English summary
Minister C Ramachandraiah has lashed out at TDP chief Nara Chandrababu Naidu and late YS Rajasekhar Reddy on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X