అరెస్ట్‌కు ముందు చెప్పారా?: జగన్ పిటిషన్‌పై హైకోర్టు

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. బుధవారం ఉదయం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. వాన్ పిక్ కేసులో జగన్‌ను అరెస్టు చేసినట్లు సిబిఐ తెలిపింది. ఈ కేసులో ఏడు అంశాలపై దర్యాఫ్తు పూర్తి అయిన తర్వాతే బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పిందని సిబిఐ న్యాయవాది తెలిపారు. జగన్‌కు బెయిల్ పిటిషన్ వేసుకునే అర్హత లేదన్నారు. సుప్రీం ఆదేశాలను వక్రీకరించారన్నారు.

సిబిఐని పలు అంశాలపై హైకోర్టు ప్రశ్నించింది. జగన్‌ను అరెస్టు చేసేముందు అన్ని కేసులు, కస్టడీ గురించి చెప్పారా అని సిబిఐని ప్రశ్నించింది. అంతకుముందు కోరేటు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వాయిదా అనంతరం తిరిగి కొంత వాదనలు పూర్తయ్యాక తిరిగి రేపటికి వాయిదా వేసింది.

నిందితుల రిమాండ్ పొడిగింపు

వైయస్ జగన్ ఆస్తుల కేసు, ఓఎంసి కేసు, ఎమ్మార్ కేసు నిందితులకు సిబిఐ న్యాయస్థానం జనవరి రెండు వరకు రిమాండును పొడిగించింది. ఈ కేసుల్లో నిందితులను ఈ రోజు న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. సిబిఐ కోర్టుకు విజయ సాయి రెడ్డి, ఐఏఎస్ అధికారి శామ్యూల్ సిబిఐ కోర్టులో జారీ అయ్యారు. ఎమ్మార్ కేసు నిందితులు బిపి ఆచార్య, విజయ రాఘవ కూడా కోర్టుకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+