హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ దేశాన్ని వెయ్యేళ్లు పాలించాం కానీ..: అసదుద్దీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
అనంతపురం: భారతదేశాన్ని వెయ్యేళ్లు పాలించిన ఘతన ముస్లింలకు ఉందని కానీ, ఇప్పుడు మాత్రం ఓటు బ్యాంకులుగా మారిపోయామని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం అన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో ఓ సభలో మాట్లాడారు. ముస్లింలను ఓఠు బ్యాంకులుగా వాడుకునే రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలోని 25 కోట్ల మంది ముస్లిలకు అన్యాయం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరికి నిరసనగానే తాము కాంగ్రెసుకు దూరమయ్యామన్నారు.

ముస్లింలు ఐక్యత గా ఉంటేనే తమ ఉనికిని చాటుకోగలరని, చిన్న చిన్న విభేదాలను విడనాడీ ఐక్యతగా ఉంటేనే పరిపాలించే హక్కును సాధించుకోగల్గుతామన్నారు. 65 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ ముస్లింలు నివసించే ప్రాంతాలు మురికి కూపంలా కనబడుతున్నాయన్నారు. నిరుద్యోగం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కమిషన్ కూడ ముస్లింల వెనుకబాటుతనం గురించి నివేదిక ఇచ్చినా అభివృద్ధి చర్యలు శూన్యమన్నారు.

ముస్లింలు బలహీనులు అనుకుంటే పొరపాటు అన్నారు. ఈ దేశంలో ఎవరికి వారు తమ తమ సంఘాలను ఏర్పాటు చేసుకొని రాజ్యమేలుతున్నారని, ఇదే మాటను మజ్లిస్ చెబితే మాత్రం మతం రంగును పులుముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ మతతత్వ పార్టీ కాదన్నారు. సచార్ కమిటీ ముస్లింల స్థితిగతులపై ఇచ్చిన నివేదికలో ముస్లింల పరిస్థితి ఎస్సీ, ఎస్టీ కంటే హీనంగా ఉందని పేర్కొందన్నారు.

దేశంలోని పలు ప్రాంతాలలో ముస్లింలపై దాడులు జరిగి నప్పుడు ఎంఐఎం స్వయంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులను చక్కదిద్దడమే కాకుం డా కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఆదుకుందన్నారు. ముస్లింలు వివిధ పార్టీ లకు ఓటు బ్యాంకులు కాదన్న విషయా న్ని గుర్తుంచుకోవాలన్నారు. కిరణ్ సర్కా ర్ ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.

English summary
MIM MLA Akbaruddin Owaisi said on Tuesday that Muslims were ruled India thousand years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X