వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదేళ్లలో 123 బిలియన్ డాలర్ల సొమ్ము తరలిపోయింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

India lost $123b in stash last decade
వాషింగ్టన్: భారత దేశం నుండి 2001 - 2010 మధ్య.. అంటే పదేళ్లలో 123 బిలియన్ డాలర్ల బ్లాక్ మనీ తరలి పోయిందట. ఇలా అక్రమంగా తరలి పోయి నష్టపోయిన దేశాల్లో భారత్ ఎనిమిదోది. భారత్ కంటే ముందు స్థానాల్లో చైనా, మెక్సికో, మలేషియా, సౌదీ అరేబియా, రష్యా, పిలిప్సీన్, నైజీరియాలు ఉన్నాయి. అత్యధికంగా చైనా 2.74 ట్రిలియన్ డాలర్లను నష్టపోయింది.

మెక్సికో 476 బిలియన్ డాలర్లు, మలేషియా 285 బి.డా., సౌదీ అరేబియా 201 బి.డా., రష్యా 152 బి.డా., పిలిప్సీన్ 138 బి.డా., నైజీరియా 129 బి.డా.గా ఉంది. ఆ తర్వాత భారత్ 123 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. బ్లాక్ మనీ తరలిపోయిన టాప్ 20 ఆసియా దేశాల్లో భారత్ తప్ప మరే దేశం లేదు.

కేవలం ఒక్క 2010లోనే భారత్ నుండి అక్రమంగా తరలిపోయిన మొత్తం రూ.8,752 కోట్లుగా ఉందట. దీనిని జిఎప్ఐ అనే సంస్థ వెల్లడించింది. 6,73,056(123 బిలియన్ డాలర్లు) కోట్లు కోల్పోవడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తమే అని జిఎఫ్ఐ ఆర్థిక వేత్త అన్నారు.

భారత పౌరులపై దీని ప్రభావం ఎక్కువేనని, విద్య, వైద్యం, మౌలిక వసతుల మెరుగుకు ఈ మొత్తం ఉపయోగపడి ఉండేదని, ఇందులో కొంత మొత్తం భారత్‌లోనే ఉండి ఉంటే జాతీయ పవర్ గ్రిడ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉపకరించేదని, గత వేసవిలో విద్యుత్ సంక్షోభం ఎదురయి ఉండేది కాదని పేర్కొన్నారు.

English summary
India lost A whopping $123 billion in black money during 2001-2010, making it eighth largest victim of illicit financial outflow, a US based research and advocacy organization said in a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X