రేపిస్టులకు ఉరే సరి: లోకసభలో సుష్మా, జయ కన్నీళ్లు

Sushma Swaraj - Jaya Bachchan
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ పార్లమెంటును కుదిపేసింది. రేపిస్టులకు ఉరే సరి అంటూ బిజెపి లోకసభ పక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. సుష్మా మాటలకు పలువురు నేతలు మద్దతు పలికారు. సమాజ్ వాది పార్టీ నేత జయాబచ్చన్ అయితే రాజ్యసభలో ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన దోషులకు మరణ శిక్ష విధించాలని ఉభయసభల సభ్యులూ డిమాండ్ చేశాయి.

ఢిల్లీలో మహిళల భద్రతపై ఉభయ సభల్లో మహిళా సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ కేసుపై శరవేగంగా దర్యాప్తు జరుపుతామని, పోలీసుల వైపు తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని షిండే హామీ ఇచ్చారు. సామూహిక అత్యాచారం ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ మంగళవారం సభ్యులు తమంతట తాముగా స్పందించారు. ఇటువంటి ఘటనలు మొత్తం సమాజానికే అవమానకరమని, కేంద్రం వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు.

డిఎంకె సభ్యురాలు వసంతి స్టాన్లే, అన్నాడిఎంకె కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎంపి గిరిజా వ్యాస్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి శిక్ష విధిస్తే అత్యాచారం చేసిన తర్వాత మహిళలను చంపేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాలను అదుపు చేయడంలో విఫలమైన ఢిల్లీ పోలీసు చీఫ్‌ను వెంటనే తొలగించాలని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+