నా కొడుకు ప్రధాని అవుతాడు: మోడీ తల్లి, నితీష్ నో

Narendra Modi-Nitish Kumar
అహ్మదాబాద్: తన కొడుకు దేశ ప్రధానమంత్రి అవుతాడని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తల్లి హీరా బా గురువారం అన్నారు. నా కొడుకు దేశ ప్రధాని అవుతాడని, అతను గుజరాత్‌ను గెలిచాడని, నా హృదయం ఉప్పొంగుతోందని, గుజరాత్‌కు, గుజరాత్ ప్రజలకు మరింత సేవ చేస్తాడని తాను గట్టిగా నమ్ముతున్నానని మోడీ తల్లి చెప్పారు. నరేంద్ర మోడీ ఇక్కడితే తన విజయాన్ని ఆపరన్నారు.

మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ గుజరాత్‌లో నరేంద్ర మోడీ విజయం పైన స్పందించలేదు. పలు పార్టీలు గుజరాత్ ఫలితాలపై స్పందిస్తున్నప్పటికీ నితీష్ మాత్రం స్పందించలేదు. ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించాలన్న బిజెపిలోని కొందరి ప్రతిపాదనలతో జెడి(యు) ముఖ్యంగా నితీష్ కుమార్ విభేదిస్తున్న విషయం తెలిసిందే. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే జెడి(యు) ఎన్డీయేకి మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించింది.

2014 ఎన్నికలపై గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లాఅన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి ఓడిపోవడంతో ప్రజల తీర్పును గౌరవిస్తామని ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ అన్నారు. నియోజకవర్గ పునర్విభజన వల్ల బిజెపి గెలుపుపై ప్రభావం పడిందన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌ను హస్తగతం చేసుకున్నామని, గుజరాత్‌లో ఎక్కువ సీట్లను గెలుపొందామని ఎపి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు హవా కొనసాగిందని, ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందన్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్‌కే పరిమితం అని అభిషేక్ సింఘ్వీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+