• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్టీఆర్ జనతా స్కీమ్ పునరుద్ధరణ: చంద్రబాబు హామీ

By Pratap
|
Chandrababu Naidu
కరీంనగర్: తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమం కోసం గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం అమలు చేసిన జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో తన వస్తున్నా... మీకోసం పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన శనివారం కొత్తపల్లిలో చేనేత డిక్లరేషన్ ప్రకటించారు. చేనేత కార్మికులపై ఆయన హామీల వర్షం కురిపించారు.

చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమాను అమలు చేస్తామని, చేనేత రంగంలోని వృద్ధులకు వేయి రూపాయల చొప్పున పింఛను కల్పిస్తామని ఆయన వాగ్దానం చేశారు. చేనేత రంగానికి ఏటా వేయి కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయిస్తామని చెప్పారు. పట్టు, నూలు, సిల్క్‌లపై 50 శాతం సబ్సిడీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాల విక్రయంపై 30 శాతం రిబేట్ ఇస్తామని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా చేనేత కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా చేనేత బజార్లు ఏర్పాటు చేస్తామని, మగ్గాలకు విద్యుత్తు సబ్సిడీ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. చేనేత రంగానికి ఉపాధి హామీని వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు శనివారం 1300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయనతో కొత్తపల్లి నాయకులు కేక్ కట్ చేయించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్‌ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ చీవాట్లు పెట్టారని ఆయన చెప్పారు. అవినీతిపరుడిని రక్షించాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి నిరసనగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆయన ఖండించారు. శాంతియుతంగా ప్రదర్సన నిర్వహిస్తున్న విద్యార్థులపై హింసాత్మక చర్యలకు దిగడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. కాగా, చంద్రబాబు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల నుంచి ఆయనకు ముప్పు ఉందనే సమాచారం అందడంతో ప్రభుత్వం భద్రతా చర్యలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

విద్యుత్తు బిల్లులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని ఆయన కొత్తపల్లిలో అన్నారు. కరువు వచ్చినా విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. సర్‌చార్జీ పేరుతో ప్రజల జేబులను ప్రభుత్వం గుల్ల చేస్తోందని ఆయన విమర్శించారు. మగవారితో సమానంగా మహిళలను తీర్చిదిద్దిన ఘనత కూడా తమకే దక్కుతుందని ఆయన చెప్పుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

కరీంనగర్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
20,54,293
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  79.27%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  20.73%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  19.03%
  ఎస్సీ
 • ఎస్టీ
  2.47%
  ఎస్టీ

English summary
Telugudesam president N Chandrababu Naidu has announced that he will revive Janata scheme, which was introduced by NT Rama Rao in his regime.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more