వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం పోటీ చేశాకే తెలుగు వారికి అక్కడ టిక్కెట్లు: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీగా ముప్పయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ అని ఆ పార్టీ నేతలు మాణిక్య రావు, మాధవ నాయుడు శనివారం తెలిపారు. అండమాన్ నికోబర్ దీవుల్లో తెలుగుదేశం పార్టీ శాఖకు అధికారికంగా గుర్తింపు లభించిందని వారు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుండి తాము అండమాన్లో టిడిపి శాఖ కోసం పట్టుబడుతున్నామని వారన్నారు.

అయితే గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అందుకు నిరాకరించారన్నారు. అయితే దేశంలో ఎన్నో పార్టీలకు అక్కడ శాఖలు ఉన్నాయన్నారు. అక్కడి మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీకి గుర్తింపు కావాల్సిందేనని తాము ఇటీవల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కోరామని. అందుకోసం పట్టుబట్టామన్నారు.

దీంతో అతను అండమాన్లో శాఖకు గుర్తింపు ఇచ్చారన్నారు. అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేశామని, పోర్ట్‌బ్లెయిర్‌లో 18 వార్డులుంటే తాము పది వార్డుల్లో పోటీ చేశామని, ఒకటి గెలుచుకొని నాలుగింటిలో రెండో స్థానంలో నిలిచామన్నారు. ఇప్పుడు అక్కడ తెలుగు వారికి రాజకీయ గుర్తింపు వచ్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ మేం పోటీ చేయబోతున్నామన్నారు.

తాము పోటీకి దిగిన తర్వా అండమాన్ చరిత్రలో మొదటిసారి కాంగ్రెసు, బిజెపిలు తెలుగువారికి టిక్కెట్లు ఇచ్చాయన్నారు. అక్కడి తెలుగు వారికి రాజకీయంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర నుండి ఎక్కువగా ఉన్న తెలుగువారి కోసం విశాఖలో అండమాన్ అతిథి గృహం కావాలని తాము పోరాడుతున్నామన్నారు.

English summary
Telugudesam is not regional party, now it is national 
 
 party said, TDP leaders on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X