• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసులతో వద్దు, శాంతి: అత్యాచార ఆందోళనపై ప్రధాని

By Srinivas
|
Manmohan Singh
న్యూఢిల్లీ: హింసతో సాధించేదేమీ లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం ఆందోళనకారులకు పిలుపునిచ్చారు. గ్యాంగ్ రేప్ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని స్పందించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. హింసతో సాధించేదేమీ లేదన్నారు. పోలీసులతో తగాదా భవిష్యత్తుకు మంచిది కాదని సూచించారు.

మహిళలకు మరింత పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆందోళనలు హింసాత్మకం మారడం సరికాదన్నారు. బాధితురాలు కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఆందోళనకారులు దయచేసి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఘటనపై తాను వ్యక్తిగతంగా చింతిస్తున్నామని చెప్పారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ప్రజల ఆందోళన అర్థవంతమైనదే గానీ హింసాత్మకమే సరికాదన్నారు. బాధితారులని, వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

కాగా ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఐ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆందోళనకారులతో మాట్లాడిన విషయం తెలిసిందే. గ్యాంగ్ రేప్ ఘటన ఢిల్లీలో వారం రోజులుగా చర్చనీయాంశమైంది. నిందితులను శిక్షించాలని ఆందోళనకారులు రోడ్డెక్కారు. ఆదివారం సోనియా, రాహుల్ గాంధీలు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. మేము మీతో ఉన్నామని... న్యాయం జరిగేలా చూస్తామని వారికి శనివారం అర్ధరాత్రి హామీ ఇచ్చారు.

అర్ధరాత్రి 12.10 నిమిషాల సమయంలో సోనియా వారితో దాదాపు ఇరవై నిమిషాల పాటు మహిళలకు రక్షణ అంశంపై మాట్లాడారు. 10 జనపథ్‌లోని తన ఇంటి నుండి బయటకు వచ్చిన సోనియా కింద కూర్చొని మాట్లాడారు. తాను మీతో ఉన్నానని, ఎప్పటిలోగా న్యాయం చేయగలమో చెప్పలేమని అయితే న్యాయం మాత్రం తప్పకుండా చేస్తామని, అందుకోసం మేం ప్రయత్నాలు చేస్తున్నామని సోనియా ఆందోళనకారులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఆందోళనకారులు సోనియా గాంధీకి డెడ్ లైన్ పెట్టగా.. డైడ్ లైన్ లాంటివేవీ లేవని.. అయితే కఠిన చర్యలు మాత్రం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం కూడా ఆందోళనకారులు ఢిల్లీ రోడ్ల పైకెక్కారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు మెట్రో రైలు గేట్ల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆదివారం పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటరియేట్, ఉద్యోగ్ భవన్, రేసు కోర్సు తదితర ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్స్ మూతపడ్డాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Prime Minister Manmohan Singh on Monday appealed to all sections of the society for calm in the wake of the violent protests that shook the national capital over the weekend demanding strict punishment for those who brutally raped a 23-year-old paramedical student here on Dec 16 night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more