వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆల్ పార్టీ'స్‌కి టెన్షన్: ఇరుకున పడేదెవరు, పెట్టెదెవరు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై శుక్రవారం జరగనున్న అఖిల పక్ష సమావేశం వేడి ఇటు రాష్ట్రంలో, అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో కనిపిస్తోంది. అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ వాణిని వినిపించేందుకు ఆయా పార్టీల ప్రతినిధులు, తెలంగాణవాదులు, సమైక్యవాదులు ఢిల్లీకి చేరుకున్నారు.. చేరుకుంటున్నారు. విభజనపై ఎవరి మాట ఎలా ఉన్నా.. తెలంగాణపై ఇదే చివరి అఖిల పక్ష సమావేశం కావాలని ఇరు పార్టీల నేతలు ఆకాంక్షిస్తున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, తెలుగుదేశం పార్టీలు మాత్రం అఖిల పక్ష సమావేశాన్ని ఏదో తూతూమంత్రంగా అభివర్ణిస్తున్నాయి. సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నేతలలో కూడా అదే ఉంది. అయితే ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు మాత్రం అఖిల పక్ష సమావేశంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ భేటీతో తెలంగాణపై తేలిపోతుందని వారు గట్టిగా భావిస్తున్నారు.

అయితే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెబితేనే అది సాధ్యమని వారు అంటున్నారు. ఆయా పార్టీల నుండి ఇద్దరు ప్రతినిధులు వెళుతున్నారు. కాంగ్రెసు పార్టీ మినహా అన్ని పార్టీలు వేరు వేరు ప్రాంతాల నుండి ఇద్దరం వెళ్లినా ఒకే నిర్ణయాన్ని చెబుతామని ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెసు పార్టీకి చెందిన ఆరుగురు నేతలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. వారిలో నుండి ఇద్దర్ని భేటీకి పంపించనున్నారు.

All Party Meeting heat in Delhi

తెలంగాణ ప్రాంతానికి చెందిన చిన్నారెడ్డి, మల్లు రవి, సురేష్ రెడ్డి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చెంగల్రాయుడు, ఉండవల్లి అరుణ్ కుమార్, గాదె వెంకట రెడ్డిలు ఉన్నారు. అఖిల పక్ష సమావేశంపై ఎవరికి వారు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అఖిల పక్షంలో చెప్పే అభిప్రాయాలను బట్టి, ప్రత్యర్థి పార్టీలు ఏం చెబుతాయో ముందే వేసుకున్న అంచనాలను బట్టి ఆయా పార్టీలు ఇతర పార్టీలను ఇరుకున పడేసే ప్రయత్నాలను ఇప్పటి నుండే ప్రారంభిస్తున్నాయి.

అఖిల పక్ష సమావేశం తర్వాత ఎవరు ఇరుకున పడతారు? ఎవరు ఇరుకు పెడతారు? అనే అంశం ఆసక్తికరంగా మారింది. 2008 నాటి లేఖకు కట్టిబడి ఉన్నామని చెప్పాలనే అభిప్రాయానికి టిడిపి ఇప్పటికే వచ్చినట్లుగా తెలుస్తోంది. టిడిపి అనుకూలంగా చెప్పినా.. వ్యతిరేకంగా చెప్పినా ఎదురుదాడికి దిగేందుకు బిజెపి, తెరాసలు సిద్ధంగా ఉన్నాయి. బాబు వల్లే మూడేళ్ల క్రితం తెలంగాణ వెనక్కి పోయిందని, ఆయన మాటలను నమ్మే స్థితి లేదని ఆ పార్టీలు బాబుపై విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

మరోవైపు టిడిపి కూడా అనుకూలమని చెప్పడం ద్వారా తెరాసకు గట్టి షాక్ ఇవ్వడమే కాకుండా కెసిఆర్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉంది. అనుకూలంగా చెప్పి కెసిఆర్‌ను తెలంగాణ ప్రాంతంలో దెబ్బతీయాలనే యోచనలో ఉంది. అదే సమయంలో సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు కూడా అక్కడ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. నాటి లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పామని అయితే విభజన మాత్రం కేంద్రం చేతిలోనే ఉంటుందని వారు సీమాంధ్రలో చెప్పనున్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో చెప్పాల్సిన అభిప్రాయం పైన డైలమాలో ఉండటమే కాకుండా.... ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితులో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. 2008 లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా చంద్రబాబు పూర్తిగా తెలంగాణ వ్యతిరేక ముద్రను తొలగించుకోలేక పోయినా మెరుగని మాత్రం చెప్పవచ్చు.

తెలంగాణ సెగ ఆయనకు తగిలే అవకాశం ఉండదనే చెప్పవచ్చు. వైయస్సార్ కాంగ్రెసు కేంద్రంపై భారం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ అభిప్రాయంపై పట్టుబట్టనుంది. అదే అయితే తెలంగాణ సెగ వారికి తప్పదనే చెప్పవచ్చు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెసు ఏ నిర్ణయాన్ని చెప్పాలో తెలియక తర్జన భర్జన పడుతోంది. అనుకూలమంటే ఓచోట ప్రతికూలమంటే మరోచోట పార్టీకి ఇబ్బందులే. ఒక విధంగా చూస్తే అన్ని పార్టీల కంటే కాంగ్రెసు పార్టీకే అఖిల పక్ష సమావేశం ఇబ్బందులను తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
All the parties like Telugudesam, Congress, YSR Congress, BJP, TRS, MIM, CPI and CPM are ready to All Party Meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X