హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యవాదంతో పోటీ:జగ్గారెడ్డి సంచలనం, కెసిఆర్‌పై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
హైదరాబాద్: తాను వచ్చే ఎన్నికల్లో సమైక్యవాదంతోనే తన సొంత జిల్లా మెదక్‌లో పోటీ చేస్తానని సంగారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు రాష్ట్రం వస్తే తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు.

కెసిఆర్ తన నాటకానికి ఇప్పటికైనా తెరదించాలని సూచించారు. 2014 ఎన్నికల్లో తాను సమైక్యవాదంపై పోటీ చేస్తానని, తనను ప్రజలు తిరస్కరించిన పక్షంలో రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. సమైక్యంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రాన్ని రెండుగా లేక మూడుగా విభజించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణకు 10వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏళ్లుగా పదవులు అనుభవిస్తూ కెసిఆర్, హరీష్ రావులు మెదక్‌నే అభివృద్ధి చేయలేదు. ఇక తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారన్నారు. ఉద్యమం అంటే బతికించే విధంగా ఉండాలి. అంతేకానీ చంపే విధంగా ఉండవద్దని కెసిఆర్‌కు, తెలంగాణ రాష్ట్ర సమితికి జగ్గారెడ్డి సూచించారు. జిల్లాలో ఒక్క సీటు మాత్రమే గెలిచిన కెసిఆర్ మాకు నీతులు చెబుతారా అని ప్రశ్నించారు.

అఖిలపక్షంతో పరిష్కారం కాదు

ఈ నెల 28వ జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం తమకు లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. అన్ని పార్టీలు అఖిల పక్షంలో స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చలో అసెంబ్లీని నిర్వహిస్తామన్నారు. తెలంగాణను వ్యతిరేకించే పార్టీలు మా మధ్య ఉండేందుకు వీలు లేదన్నారు.

సమైక్యవాదులు తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షించవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించే పార్టీల గద్దెలను కూల్చుతామని హెచ్చరించారు.

English summary
Sanga Reddy MLA Toorpu Jayaprakash Reddy has said on Thursday that he will contest with United state slogan in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X