హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ: భేటీలో తడబాటు, తర్వాత సర్దుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

KK Mahendar Reddy-Jitta Balakrishna Reddy
హైదరాబాద్: అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై తడబాటు ప్రదర్శించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత సర్దుబాటు ప్రదర్శించింది. ఆత్మరక్షణలో పడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు తాము తెలంగాణకు వ్యతిరేకమని చెప్పలేదు కదా అని సర్దిచెప్పుకునే ప్రయత్నాలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, ఒక తండ్రిలాగా వ్యవహరించి అందరికీ న్యాయం చేయాలని మాత్రమే తాము అఖిలపక్ష భేటీలో చెప్పామని ఆ పార్టీ ప్రతినిధి కె.కె.మహేందర్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ ఇవ్వొద్దని చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా వైఖరి చెప్పినప్పటికీ, కేవలం ఉనికి కోసం తమ పార్టీపై కెసిఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. ఓట్లు, సీట్లు పొందటానికే శనివారం బంద్‌కు పిలుపునిచ్చారని ఆరోపించారు. జగన్ జైలు నుంచి బయటికి వచ్చాక ఉత్తర తెలంగాణలోనూ కెసిఆర్‌కు చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.

ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు జోకర్లలా మాట్లాడుతున్నారని పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, జనక్ ప్రసాద్ తదితరులు విమర్శించారు.తెలంగాణపై సోనియాగాంధీని అడిగే దమ్ములేని తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు తమ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. ఇతర పార్టీల్లాగా తాముకాదని, రాయలసీమ నడిబొడ్డున(ఇడుపులపాయ ప్లీనరీలో) జగన్ 'జై తెలంగాణ' అన్నారని చెప్పారు. తమ పార్టీపై అవాకులు, చెవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

అన్ని పార్టీలు తమ వైఖరి చెప్పినా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఎంపీలు సిగ్గులేకుండా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణపై తాము స్పష్టంగా చెప్పామని తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.

English summary
Telangana YSR Congress party leaders are trying to make their stand on Telangana issue justified. YSR Congress party leaders KK Mahendar Reddy and Jitta Balakrishna Reddy said that his party has not told against Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X