వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: బాబు నిర్ణయానికి ఎంపి నో, లగడపాటి దార్లో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Modugula Venugopal Reddy
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని నర్సారావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి శనివారం అన్నారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమైక్యవాదంపై మాట్లాడుతానని చెప్పారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను ఆయనకు తెలియజేస్తానన్నారు.

ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తానన్నారు. పార్లమెంటులో సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక రాష్ట్రానికి టిడిపి సానుకూల వైఖరి ప్రదర్శించడంపై పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తమకు సమైక్యాంధ్రనే ముఖ్యమని, రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని అన్నారు. సీమాంధ్ర సమైక్యతనే కోరుకుంటున్నారన్నారు.

కర్ణాటకలో నిర్మించిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఇప్పటికే నీటి ఎద్దడి ఏర్పడిందని, తెలంగాణ ఏర్పడితే కోస్తాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాదిరిగా టిడిపి తరఫున తాను కూడా చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

English summary
Narsaraopet TDP MP Modugula Venugopal Reddy has opposing Party's decision over Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X