మాజీ కార్పోరేటర్ దారుణ హత్య: ఉన్మాది వీరంగం

Anantapur
అనంతపురం: అనంతపురంలో మాజీ కార్పోరేటర్ ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని నేషనల్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో రామకృష్ణా రెడ్డి అనే మాజీ కార్పోరేటర్ హత్యకు గురయ్యాడు. ఈ పార్కు జాతీయ రహదారి పక్కనే ఉంది. రామకృష్ణా రెడ్డి ఉదయం వాక్ కోసం అక్కడకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై వేట కొడవళ్లతో దాడి చేశారు.

దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. హతుడు గతంలో నక్సల్స్ ఉద్యమంలో పని చేశాడు. ఆ తర్వాత అజ్ఞాతం వీడి సిపిఐఎంల్ న్యూడెమోక్రసీ తరఫున పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలుపొందాడు. రామకృష్ణా రెడ్డి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అతనిని చంపిన వారు వెంటనే అక్కడి నుండి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రామకృష్ణా రెడ్డి గత మున్సిపల్ ఎన్నికలలో 41వ డివిజన్ నుండి పోటీ చేసి గెలిచాడు. కాగా ఈ హత్యకు భూవివాదం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అనంతపురం నగర పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఉన్మాది వీరంగం

కర్నూలు జిల్లా ఆత్మకూరులో మంగళవారం ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. కత్తితో నలుగురు వ్యక్తులపై దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+