హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు మంచివ్యక్తి.. గౌరవిస్తాం, మాట్లాడించారు:కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Rajagopal Reddy
హైదరాబాద్: కేంద్రమంత్రి చిరంజీవి పైన తమకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవముందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం అన్నారు. నిన్న నల్గొండ జిల్లాకు వచ్చిన చిరంజీవి తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన స్వయంగా చేసినవి కావని, అలా మాట్లాడించారన్నారు. చిరంజీవితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయించారని ధ్వజమెత్తారు.

చిరంజీవి మంచి వ్యక్తి అని, ఆయన పట్ల తనకు గానీ, తన సోదరుడికి గాని వ్యతిరేకత లేదని, ఆయనను వ్యక్తిగతంగా గౌరవిస్తామన్నారు. ఆయన కుటుంబంతో కూడా తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో చిరంజీవి కాంగ్రెసు పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని తాము భావిస్తున్నామన్నారు.

కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వని పక్షంలో విభజన కోసం పని చేస్తున్న పార్టీలో తాము చేరుతామన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తమను కాంగ్రెసు పార్టీ నుండి పంపించి వేసే కుట్ర జరుగుతోందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలలోకి రాకముందే కాంట్రాక్టులు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంట్రాక్టుల కోసం పైరవీలు చేసే రకం తాము కాదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డివి దిగజారుడు మాటలన్నారు. ఆయనలా తాను దిగజారి మాట్లాడలేనన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వమని చెబితే పార్టీని వీడేందుకు సిద్ధమన్నారు. కాంట్రాక్టులు టెండర్ల ద్వారా వస్తాయన్నారు. తమ కంపెనీకి ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆఫ్రికాలో కూడా ఉన్నాయన్నారు. తమ సుశీకంపెనీ కాంగ్రెసుతోనే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతోనే నడిచేది కాదన్నారు.

ప్రాజెక్టు కాంట్రాక్టుల ద్వారా వచ్చిన డబ్బును కూడా తాము ప్రజా సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని చెప్పారు. తాము ఏమైనా తప్పులు చేసి ఉంటే విచారణ జరిపించుకోవచ్చునని సవాల్ చేశారు. తన సోదరుడు వెంకట రెడ్డికి కంపెనీతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసిన తన సోదరుడికి మంచి ఇమేజ్ వచ్చిందని, దానిని నాశనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు.

తాము రాజకీయ విలువల కోసం పని చేస్తున్నామన్నారు. తమపై విమర్శలు గుప్పించే వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ సాధనే తమ ఏకైక లక్ష్యమన్నారు. కాగా అంతకుముందు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంట్రాక్టులపై మాట్లాడేందుకు నిరాకరించారు. కాంట్రాక్టులపై తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి స్పందిస్తారన్నారు.

English summary
Bhuvanagiri MP Komatireddy Rajagopal Reddy has said on Wednesday that he can respect central minister Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X