నా భిక్షే: కోమటిరెడ్డి: పార్టీని అమ్ముకున్న చిరు ఖబర్దార్

Chiranjeevi - Komatireddy Venkata Reddy
హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వివాదం ముదురుతోంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనిలో పనిగా కేంద్రమంత్రి చిరంజీవి పైనా నిప్పులు చెరిగారు. పైరవీల కోసమే అయితే తాను మంత్రిగా కొనసాగి ఉండేవాడినన్నారు. ఉత్తమ్ తెలంగాణ ద్రోహి అన్నారు. ఆయన మంత్రి పదవి తన భిక్షే అన్నారు.

నియోజకవర్గంలో ఇసుక దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ రుణాలతో పవర్ ప్లాంట్లు నడుపుతున్నారన్నారు. తెలంగాణ ఇవ్వలేమని చెబితే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్యాకేజీలు తదితరాలు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. ఉత్తమ్ భాషను మార్చుకోవాలని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. అధికారం కోసమే మంత్రుల కక్కుర్తి అన్నారు.

చిరంజీవిపై నిప్పులు

పదవి కోసం అమ్ముడు పోయిన చిరంజీవి తనకు నీతులు చెప్పే వారా అని ధ్వజమెత్తారు. తెలంగాణలో చిరంజీవి అడుగు పెడితే ఖబర్దార్ అన్నారు. తెలంగాణకు అనుకూలమని చిరంజీవి చెప్పే వరకు తాను వదిలే ప్రసక్తి లేదన్నారు. సామాజిక తెలంగాణ అని పెట్టిన ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్నాడని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని సమర్థించిన చిరంజీవి సంస్కారవంతుడా అన్నారు. కూతురింట్లో డబ్బులు దొరికితే కేసు మాఫీ కోసం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని బతిమాలుకున్నావని విమర్శించారు.

తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లినా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వచ్చేది మంత్రి పదవే అన్నారు. అదే మంత్రి పదవిని తాను ఇప్పుడు వదులుకున్నానన్నారు. అలాంటప్పుడు తాను జగన్ వైపు ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. తాను తెలంగాణ కోసమే పని చేస్తానన్నారు. అవసరమైతే కొండా లక్ష్మణ్ బాపూజీ తరహాలో స్వతంత్ర ఉద్యమం చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+