వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో జగన్ న్యూఇయర్: ఫ్యామిలీ విషెస్ మాత్రమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. 1 జనవరి 2013 నూతన సంవత్సరం సందర్భంగా జగన్‌ను కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో పలువురు మాత్రం వచ్చినట్లుగా తెలుస్తోంది.

కాగా అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బ్యారక్‌‍లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. జగన్ రిమాండు ఖైదీగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. గత పదిహేను సంవత్సరాలుగా జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ క్రిస్మస్ వేడుకలను పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరుపుకునేవారు.

కానీ ఈ సంవత్సరం అరెస్టై జైలులో ఉండటంతో క్రిస్మస్‌ను జగన్ తోటి విఐపి ఖైదీల మధ్య జరుపుకున్నారు. పండుగ సందర్భంగా జగన్ తన బ్యారక్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారట. జగన్‌కు తోటి విఐపి ఖైదీలు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, రాజగోపాల్, నూకారపు సూర్యప్రకాశ రావు తదితరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినట్లుగా తెలుస్తోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు దినం కాబట్టి ములాఖత్‌లు లేకపోవడంతో జగన్‌ను కుటుంబసభ్యులు కలవలేకపోయారు.

మరోవైపు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మణికొండ హుడా కాలనీలోని బ్రదర్ అనిల్‌ కుమార్‌కు చెందిన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చర్చికి వచ్చిన విజయమ్మ, బైబిల్ చేతిలో పట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్‌ కుమార్, చర్చికి వచ్చిన వారికి క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి వివరించారు. జగన్ సోదరి షర్మిలకి కీ హోల్ ఆపరేషన్ అయి విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసిందే.

English summary

 YSR Congress chief YS Jaganmohan Reddy has very few visitors on New Year's day, with only his immediate family turning up to greet him at the central prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X